వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు
ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట మున్సిపాలిటీ 16వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని సత్యవరపు లక్ష్మీ ప్రసన్న తన మద్దతుదారులతో కలిసి శనివారం వార్డులో ముమ్మరంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని విమర్శించారు. అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, మున్సిపాలిటీ పురోభివృద్ధి కోసం ప్రజలంతా కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణతో పాటు నియోజకవర్గ, మండల నాయకులు, వార్డు ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మీ ప్రసన్నకు తమ మద్దతు తెలిపారు.








