మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తు ఆలోచించని త్యాగాధని మాత రమాబాయి
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తును ఆలోచించని త్యాగ ధని మాత రమాబాయి అని పలువురు వక్తలు కొనియాడారు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు అవసమని గుర్తించి , నిరంతరం శ్రమించిన రమాబాయి కారణంగానే మనకు భారత రాజ్యాంగం రచించే అవకాశం అంబేద్కర్ కు లభించిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక వైయస్సార్ కాలనీ లో జయంతి కార్యక్రమాన్ని వీర నారీమణుల ఆశయ సాధన సమితి సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ ఉపాధ్యక్షురాలు భూక్య జ్యోతి అధ్యక్షతన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగాలు చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. వీర వనిత రమాబాయి చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా
వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి మాట్లాడుతూ జీవితం లో ఎన్నో కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొంటూ తన భర్త అంబేద్కర్ ఆశయ సాధనకు తన బ్రతుకంతా దారపోసిన వీర నారీ మణి మాత రమాబాయి అని కొని యాడారు. తన పిల్లలు మృతి చెందిన అణగారిన వర్గాల బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించిన మాత రమాబాయి అని తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ మాట్లాడుతూ పేద నిమ్న వర్గానికి చెందిన రమాబాయి వారి సంక్షేమం, అభివృధి గురించి తపన పడ్డారని, తన భర్త అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడానికి ఆమే చేసిన త్యాగాలు, తన పిల్లలు చని పోయిన తన కార్య దీక్ష ను విరమించని ధీర వనిత రమాబాయి అని కొని యాడారు.సామాజిక వేత్త మీగడ రామారావు మాట్లాడుతూ మాత రమాబాయి జీవితం మహిళా మణుల కు ఆదర్శం, స్పూర్తి దాయకం…తన లక్ష్య సాధన లో అనేక కష్టాలు వచ్చిన భరించి, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తద్వారా భారత రాజ్యాంగాన్ని అందించిన వీరనారి మాత రమాబాయి అని కొనియాడారు. కార్యక్రమంలో వీరా నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి షరీఫా బేగం , ఆఫీస్ ఇంచార్జి కృష్ణవేణి , అధికార ప్రతినిధి సరోజని , గౌరవ సలహా దారులు కొత్త పల్లి పుష్ప, శ్రీదేవి,
సభ్యులు విజయ, లక్ష్మి, స్వాతి, నాగమణి, శ్రీదేవి, వర లక్ష్మీ, ఉషా, రమ్య, కుమారి, ప్రమీల, లత , జాన్సీ,
క్రమ శిక్షణ కమిటీ కన్వీనర్ పుల్లూరి నాగయ్య, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు యలమందల జగదీష్ , ఆటో యూనియన్ అధ్యక్షులు పండు, అంబేద్కర్ సంఘం నాయకులు రాము, బహుజన సంఘం నాయ కులు గాంధీ, నకరికంటి సంజీవరావు, విజయ్, అర్జునరావు, శ్రీనివాస చారి, రామ్మూర్తి, పగిడిపల్లి నాగేశ్వరరావు, అఖిల్, వీరన్న నాయక్ , సురభి నాయక్,వెంకటేశ్వర్లు, పాష తదితరులు పాల్గొన్నారు.








