అశ్వారావుపేటలో ‘కారు-సైకిల్’ జోరు: ఉమ్మడి ప్రచారంతో హోరెత్తిన వీధులు
అభివృద్ధి మంత్రం.. భారీ ర్యాలీలతో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్-టిడిపి దూకుడు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 07: మున్సిపల్ ఎన్నికల ప్రచారం రెండు రోజుల్లో ముగియునున్నా సందర్బంగా అశ్వారావుపేటలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బిఆర్ఎస్, టిడిపి ఉమ్మడి మద్దతుతో బరిలో నిలిచిన 22 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కూటమి శ్రేణులు సమరశంఖం పూరించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నేతృత్వంలో పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ‘షాప్ టూ షాప్’ ప్రచారం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ భారీ ర్యాలీలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, బరగడ కృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్, చైర్మన్ అభ్యర్థి కాసాని నాగ శేష పద్మతో పాటు ముఖ్య నాయకులు సత్యవరపు సంపూర్ణ, జూపల్లి రామారావు, పద్మజ, కాసాని చంద్రమోహన్, నాని, కాట్రం స్వామి దొర, వగ్గెల పూజ, మోహన్ రెడ్డి, అంకత మల్లికార్జున రావు, నారం రాజశేఖర్, మోటూరి మోహన్, జీవన రావు, సోయం వీరభద్రం, అఖిల్, శెట్టిపల్లి రఘురామ్, సోమని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన వంటి హామీలతో ఇంటింటికీ తిరుగుతున్న నాయకులకు స్థానిక ప్రజల నుండి బ్రహ్మరథం పడుతున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఐక్యంగా కదులుతుండటంతో అశ్వారావుపేట మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది.








