+91 95819 05907

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!

*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!*

– *​ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు*

*​పుర పోరులో కాంగ్రెస్‌ ప్రభంజనం.. 80 శాతం పైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం*

నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
​:రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్‌మెంట్ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*​ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం*
“ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

*​మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు కాంగ్రెస్ వే*
రేపు (బుధవారం) జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. “గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విసిరిన సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుంది” అని అన్నారు.

*అభివృద్ధికి పెద్ద పీట…*
గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ‘వరి వేస్తే ఉరి’ అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం” అని వివరించారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!

*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!* – *​ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు* *​పుర పోరులో కాంగ్రెస్‌ ప్రభంజనం.. 80 శాతం పైగా స్థానాలు

Read More »

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ, ప్రభుత్వ ఉద్యోగస్తులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా

Read More »

ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు.

Cyberabad commissionerit Madhapur PS lo పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక

Read More »

వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

*అధ్యక్షులుగా మానాల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఉపేందర్* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల

Read More »

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి* *6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్,వైరా: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు

Read More »

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,ఖమ్మం: ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ

Read More »

 Don't Miss this News !