+91 95819 05907

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందం.
– అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి.

ఖమ్మం: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస్ రావు ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది పేద కుటుంబాలను ఒక్కసారిగా భారీ పోలీస్ బలగాలతో ఖాళీ చేయించడం సరైంది కాదన్నారు.పేదల నివాస హక్కును రక్షించాల్సిన ప్రభుత్వం, వారి ఇళ్లను కూల్చివేసి రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనలో పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులను అరెస్ట్ చేసి నిర్భందించడం సరైన కాదన్నారు.
ఇదే సమయంలో కొంతమంది అరాచక శక్తులు ఈ ఇళ్ల సమస్యను ఆసరాగా చేసుకుని పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న అలాంటి వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, భూక్యా శ్రీనివాస్ రావు, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు కూచిపూడి నరేష్, వడ్లముడి నాగేశ్వరరావు, మల్లికార్జున్ రెడ్డి, కొండం కరుణాకర్, పి సుభాష్, నల్లమల్ల సత్యనారాయణ, జట్ల ఆనందరావు పోటు హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్

Read More »

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందం. – అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి. ఖమ్మం: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో

Read More »

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ ?

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం బడ్జెట్‌ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా ?.. కాగ్‌

Read More »

కూలిన ఎయిర్ అంబులెన్స్ ◆ ఘటనలో రోగితో సహా ఒక డాక్టర్, ఒక పారా మెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి

రోగిని చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లా సిమరియా వద్ద అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి కాలిన గాయాలతో పరిస్థితి విషమించిన రోగిని చికిత్స

Read More »

CABINET DECISSIONS :ప్రభుత్వ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్

1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గం ఆమోదం

Read More »

ఐకెపిలో అక్రమాలపై విచారణ ★ అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు

కారేపల్లి ఐకేపీలో రూ.3 కోట్ల మొండిబకాయిలు *మొట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ కారేపల్లి, :కారేపల్లి మండల ఐకేపీ లో మూడు కోట్ల రూపాయలకు పైబడి మొండి బకాయిలు పేరుకుపోయాయి. మండలంలోని 60 గ్రామ సమాఖ్యల

Read More »

 Don't Miss this News !