అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి
ప్రపంచ కార్మికులకు దిక్సూచి “కమ్యూనిస్టు ప్రణాళిక”
రెడ్ బుక్ డే స్టడీ సర్కిల్ లో పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మల్లెంపాటి వీరభద్రరావు.
నేటి గదర్ న్యూస్, వైరా :
అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని, ప్రపంచ కార్మికులకు దిక్సూచి “కమ్యూనిస్టు ప్రణాళిక” అని జిల్లా రాజకీయ విద్యా విభాగం సభ్యులు పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మల్లెంపాటి వీరభద్రరావు అన్నారు. స్థానిక బోడేపూడీ భవనంలో “రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని పార్టీ వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మల్లెంపాటి వీరభద్రరావు మాట్లాడుతూ కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌లు రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన 1948, ఫిబ్రవరి 21 రోజును ”రెడ్ బుక్ డే”గా గుర్తు చేసుకుంటామని తెలిపారు. ఈ చిన్న గ్రంథం ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప” అంటూ శ్రామిక వర్గానికి ఇచ్చిన పిలుపు పెట్టుబడిదారీ వర్గాన్ని ఉలికిపాటుకు గురిచేసింది అన్నారు. పెట్టుబడిదారి దోపిడి కబంధ హస్తాలలో చిక్కుకున్న ప్రపంచ శ్రామికులకు కమ్యూనిస్టు ప్రణాళిక ఒక దిశ నిర్దేశం చెందిందని అన్నారు. అమెరికా పెట్టుబడిదారులకు, ప్రజా వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తూ ప్రపంచ దేశాల మధ్య యుద్ధొన్మాదాన్ని రెచ్చగొడుతుందని విమర్శించారు. ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్యం కోసం సుంకాలను విధిస్తుందని, తన బెదిరింపులకు లొంగని దేశాల మీద దాడులు చేసి వారిని బంధీలుగా తీసుకొని పోతుందని అన్నారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను, ఐక్యరాజ్య సమితిని లెక్క చేయకుండా తన సామ్రాజ్యవాద వైఖరిని అమెరికా ప్రదర్శిస్తున్నదని అన్నారు. మన దేశం మీద అమెరికా సుంకాలతో దాడి చేస్తున్నప్పటికీ విశ్వ గురువుగా చెప్పుకునే భారతదేశ ప్రధాని మోడీ నోరు విప్పకపోవడం, అమెరికా విధానాలను ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, భారత ఐక్యతను విచ్చిన్నం చేస్తుందని, ప్రాంతాలు, కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే, వారిని అధికారం నుంచి దించడానికి కమ్యూనిస్టు మేనిఫెస్టో అధ్యయనం ఎంతైనా అవసరం అన్నారు. సోషలిజానికి భవిష్యత్ లేదు అనేవారికి సోషలిజమే ప్రత్యామ్నాయమని చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిస్టులు, అభ్యుదయ శక్తుల పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట నాగేశ్వరరావు, గుడిమెట్ల మోహన్ రావు, హరి వేంకటేశ్వరరావు, బెజవాడ వీరభద్రరావు, మల్లెంపాటి ప్రసాదరావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, కామినేని రవి, నారికొండ అమరేందర్, అమరనేని కృష్ణ, చిత్తోజు నాగేశ్వరరావు, గుత్తా వాసు, వడ్లమూడి మధు, ఓర్పు సీతారాములు, దేవుళ్ళ కృష్ణ, మాడపాటి రామారావు, షేక్ అహ్మద్, షేక్ షఫీ, దోసపాటి పుల్లయ్య, పూనాటి సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.








