**ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్*
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.
వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన భీమిరెడ్డి పుల్లారెడ్డి భరణిపాడు నుంచి పర్వతాపురం ఆర్ అండ్ బీ రోడ్డు గుంతలతో అధ్వాన్నంగా ఉందని, భరణిపాడు కాలువ మీద ఉన్న వంతెన శిథిలావస్థలో ఉందని, వీటికి అవసరమైన మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ ఆర్ అండ్ బీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం నగరం ఖానాపురం హవేలికి చెందిన ఎన్. నటరాజ్ తాను దివ్యాంగుడినని తనకు సొంత ఇల్లు లేనందున ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నేలకొండపల్లి మండలం అప్పల నర్సింహపురం గ్రామస్తులు తమ గ్రామంలో సెల్ఫోన్ సిగ్నల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా జియో టవర్ నిర్మించుటకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ డి విభాగం పర్యవేక్షకులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వైరా మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన ఎస్సీ కాలనీ వాసులు నిరుపయోగంగా ఉన్న ఎన్.ఎస్.పి. కెనాల్ స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వైరా మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.








