ప్రమాద బాధితుడికి అండగా ‘గులాబీ’ శ్రేణులు!
బీఆర్‌ఎస్ కార్యకర్త నవీన్‌ను పరామర్శించిన మండల నాయకత్వం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గంగారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త అల్లూరి నవీన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న నేపథ్యంలో, అశ్వారావుపేట మండల నాయకులు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాద తీవ్రతను, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్న నాయకులు, నవీన్‌కు ధైర్యం చెబుతూ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల నాయకురాలు కాసాని నాగ శేష పద్మ, కాసాని చంద్రమోహన్, జజ్జూరపు శ్రీరామమూర్తి, వేదాంతపురం మాజీ సర్పంచ్ శివ శంకర ప్రసాద్, జీవన్ రావు, ఆరేపల్లి గోవింద్, యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్, గంగాధర్, తగరం హరి, బన్ను, ఉదయ్, ఆనంద్ తదితర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








