హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సెక్షన్, టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఒక ఫిర్యాదుదారునికి చెందిన సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక మేలు చేసేందుకు) రూ. 16,000/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.








