నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులకు ఆత్మ సౌజన్యంతో సహచర అభ్యాసం కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించనైనది.సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం కాపాడాలని మరియు భూసారం పెంపుగురించి సేంద్రియ ఎరువుల వాడకం పచ్చిరొట్ట ఎరువుల లాభాలు గూర్చి శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం తునికి రైతులకు సూచించారు . మరియు ఉద్యాన శాఖ విస్తరణ అధికారి గోవింద్ ఉద్యాన పంటల గురించి మరియు పనిముట్లు సబ్సిడీ గురించి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు మాసాయిపేట ఉప సర్పంచ్ పసుల వెంకటేష్ ముదిరాజ్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, ముదిరాజ్, మండల వ్యవసాయ అధికారి వేముల కవిత,ఆత్మ సిబ్బంది (ఏటీఎం) కిరణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.








