+91 95819 05907

ఉపవాసాల లక్ష్యం దైవభీతి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
ఉపవాసాల లక్ష్యం దైవభీతి , తద్వారా మానవులలో నైతిక విలువల ప్రవర్తన తీర్చిదిద్దడం అని జమా ఆతే ఇస్లామీ హింద్ జిల్లా మహిళా పబ్లిక్ రిలేషన్ కన్వీనర్ హాజీరా సదప్ అన్నారు. జమాతే ఇస్లామి హింద్ సెంట్రల్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం లో రాపర్తి నగర్ లో ఉన్న తెలంగాణ మైనారిటీ ఖమ్మం గర్ల్స్ కాలేజీ లో విద్యార్థులకు సోమవారం సాయంత్రం
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ దైవభీతి జనింప చేసి నైతిక ప్రవర్తన తీసుకు రావడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉధ్దేశమని ఆన్నారు. ఉపవాసం అనేది అన్ని మతాలవారు ఆచరిస్తారని అన్నారు. ఉపవాసం పాటించినప్పుడే మనిషిలో దైవభీతి నిగ్రహ శక్తి , సహనం పెరగడం తో పాటు మనిషికి అకలి భాధ తెలుస్తుందని అన్నారు ఇతరుల ఆకలి బాదను ఆర్ధం చేసికోగల్గుతాడన్నారు. ఉపవాసం మనిషిని సంస్కరిస్తుందని , సంస్కారమైన వ్వక్తుల ద్వారానే సత్సమాజం ఏర్పడుతుందన్నారు, కాబట్టి ప్రతి ఉపవాసి మనోవాంచలకు దూరంగా వుడడంతో పాటు సమాజంలో మంచిని పెంచి , చె డు ను పారద్రోలే ప్రయత్నం చేయాలన్నారు. అంతిమ దైవ గ్రంధమైన ఖుర్‌అన్‌ అవతరించడం వల్లనే ఈ రంజాన్‌ నెలకు ఇంతటి ప్రాధన్యత చేకూరిందని , ఇది సమస్త మానవాళికి మార్గదర్శకమన్నారు. ఉపవాసం వల్ల శాస్త్రీయంగా లాభాలను గురించి వివరించారు అనంతరం కో కన్వీనర్ జహీరా ఫాతియా మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలన్నారు.కొత్త విషయాలు కంటే చదివిన వాటిని పదేపదే రివిజన్ చేయటం వల్ల గుర్తుండటం సులభతరం అవుతుందని అన్నారు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధమై ఉత్తమ ఫలితాలు సాధించి మైనార్టీ గురుకుల కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్‌ , సభ్యులు నస్రీన్, సుమయ్య తరున్నం , కళాశాల ప్రిన్సిపాల్ అఖిల , ఉపాధ్యాయులు , విద్యార్థినిలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పీఎం శ్రీ హైస్కూల్లో ఎగ్జామ్ పాడ్స్ ఇచ్చిన మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. *మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం నాడు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పీఎం

Read More »

తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగు మట్ల భూములు స్వాధీనం…. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఆక్రమణదారుల సామాగ్రి అంబేద్కర్ భవనంలో భద్రపర్చాం వెలుగుమట్ల భూదాన్ భూములలో అక్రమ కట్టడాల తొలగింపుపై మీడియా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు

Read More »

ఉపవాసాల లక్ష్యం దైవభీతి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ఉపవాసాల లక్ష్యం దైవభీతి , తద్వారా మానవులలో నైతిక విలువల ప్రవర్తన తీర్చిదిద్దడం అని జమా ఆతే ఇస్లామీ హింద్ జిల్లా మహిళా పబ్లిక్ రిలేషన్ కన్వీనర్ హాజీరా

Read More »

అక్రమ రవాణా నివారించడం లో అంగన్వాడీ టీచర్స్ పాత్ర చాలా కీలకం

** -జిల్లా సంక్షేమ అధికారి – శ్రీమతి. విజేత -సీడీపీఓ వీర భద్రమ్మ ప్రజ్వల సమన్వయ కర్త సురేష్ కుమార్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, మహిళా

Read More »

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం నేటి గదర్ న్యూస్, ఖమ్మం : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామం మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి రెండు నెలల చిన్నారి పసిపాపను హత్య

Read More »

ఏసీబీకి పట్టుబడ్డ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్

హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సెక్షన్, టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఒక ఫిర్యాదుదారునికి చెందిన సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక

Read More »

 Don't Miss this News !