**
-జిల్లా సంక్షేమ అధికారి – శ్రీమతి. విజేత
-సీడీపీఓ వీర భద్రమ్మ
ప్రజ్వల సమన్వయ కర్త సురేష్ కుమార్
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, మహిళా శిషు సంక్షేమ శాఖ ఖమ్మం సమన్వయం తో అంగన్వాడీ టీచర్స్ కీ మనుషుల అక్రమ రవాణా, సైబర్ ట్రాఫికింగ్ పైన రెండు రోజుల శిక్షణ కార్యాక్రమం *స్థానిక ఖమ్మం టేకులపల్లి లోని డబల్ బెడ్ రూమ్ కమ్యూనిటీ హాల్లో* జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి విజేత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
అనంతరం మాట్లాడుతూ….
మానవ అక్రమ రవాణా అనేది ఒక అంతర్జాతీయ సమస్య, ముక్యంగా మహిళలు, అమ్మాయిలు దీని బారిన పడుతున్నారు, ప్రేమ పెళ్లి ఉద్యోగం సినిమా అవకాశాలు డబ్బు ఆశ చూపి అమ్మాయిలను మోసం చేసి వేరే ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహల్లో అమ్మివేస్తున్నారు. అక్కడ వారు అత్యంత దారుణంగా హింస కు గురి అవుతున్నారు. ఒక మహిళా ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి ఉంటుందా, ఇలాంటి వాటిని చూసి ఉపేక్షించకుండా వెంటనే రిపోర్ట్ చేయాలి, ప్రతి అంగన్వాడీ టీచర్ అక్రమ రవాణా పై అవగాహనా పెంచుకుని నివారించడానికి ప్రయత్నం చేయాలి అని అన్నారు
సీడీపీఓ వీర భద్రమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్స్ పాత్ర సమాజ అభ్యున్నతికి ఎంతో అవసరం అని, మన పరిధిలోని మహిళలు, అమ్మాయిలు జాగ్రత్త గా ఉండేలాగా అవగహన కల్పించాలి, ముక్యంగా సైబర్ ట్రాఫికింగ్ ద్వారా సోషల్ మీడియా గేమ్స్ లాంటి వాటి ద్వారా మోసం చేయబడుతున్నారు. ఏదైనా జరిగినప్పుడు భయపడకుండా ఎలా, ఎవరికి సమాచారం ఇవ్వాలి అనేది తెలుసుకుని అప్రమతంగా ఉండాలని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికి అవగాహనా కల్పించాలి అని అన్నారు
ప్రజ్వల సంస్థ సమన్వయ కర్త సురేష్ కుమార్ మాట్లాడుతూ… సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహనా, శిక్షణ కార్యక్రమం లను నిర్వహిస్తున్నము. ఈ శిక్షణలో అక్రమ రవాణా మరియు సైబర్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, అమ్మాయిలను ఎలాంటి హింసకు గురి చేస్తున్నారు అనే అంశాలు, అదేవిదంగా చట్టాలు భారతీయ న్యాయ సంహిత (BNS) ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రీవెన్షన్ యాక్ట్ (ITPA) పోక్సో యాక్ట్ (POCSO) చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ (PCMA) జూవెనల్ జస్టిస్ యాక్ట్ (JJA) లాంటి చట్టాలు, 1098 (చైల్డ్ లైన్) 100 (పోలీస్) 181 (మహిళా హెల్ప్ లైన్) 1930 (సైబర్ ట్రాఫికింగ్) ల గురించి వివరిస్తూ అంగన్వాడీ టీచర్సగా సమాజంలో జరుగుతున్న అక్రమ రవాణా నిరోదానికి సమాజ జాగృతి సంఘాలను ఏర్పాటు చేయాలనీ సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమం లో సూపర్ వైజర్ లు…. ప్రజ్వల సిబ్బంది అనిల్ కుమార్, మితాళి రాజ్ ఖమ్మం అర్బన్ ప్రాజెక్ట్ లోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.








