నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24.
*మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం నాడు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ లో చిన్న సహాయంగా 85 మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ ఇవ్వడం జరిగింది మాజీ సర్పంచ్ మాట్లాడుతూ తన గ్రామంలో ప్రతిసారి హై స్కూల్లో ఎగ్జామ్స్ పాడ్స్ అందజేయడం మరియు ఈ సంవత్సరం SSC పాస్ అయినవారికి 550 మార్కులు పైన వచ్చిన వాళ్లకు 2000 రూపాయలు బహుమతిగా ప్రకటించడం జరిగింది ఈ చిన్న సహాయం విద్యార్థులకు మంచిగా చదవడానికి ప్రోత్సాహం నా వంతు చిన్న సహాయంఅని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కిషన్ సార్.విట్టల్ రెడ్డి, నర్సింలు,దామోదర్ ,గిరిధర్ ,శ్రీనివాస్ , శంకర్, సలీం,రాములు,స్వప్న,సౌజన్య,వీణ,సంతోషిమాత, లక్ష్మణ్ ,బంగారయ్య తదితరులు పాల్గొన్నారు*








