+91 95819 05907

తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగు మట్ల భూములు స్వాధీనం…. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఆక్రమణదారుల సామాగ్రి అంబేద్కర్ భవనంలో భద్రపర్చాం

వెలుగుమట్ల భూదాన్ భూములలో అక్రమ కట్టడాల తొలగింపుపై మీడియా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగుమట్ల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.

అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెలుగు మట్ల భూదాన్ భూములలో అక్రమ కట్టడాల తొలగింపుపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి ప్రసాద రావుతో కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* 1953 లో కలవల రాజా రామారావు సర్వే నెంబర్ 147, 148,149 లో 31 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ ఉద్యమంలో దానం చేశారని తెలిపారు. భూ దాన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని గమనించిన ఖమ్మం అర్బన్ తహసిల్దార్ 2019 లో ఆక్రమణలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారని తెలిపారు.

ఖమ్మం అర్బన్ తహసిల్దార్ జారీ చేసిన నోటీసులను హైకోర్టులో చాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారని, హైకోర్టు తహసిల్దార్ కు భూదాన్ భూముల అంశంలో జ్యూరిస్డిక్షన్ సరిపోదని తెలుపుతూ తహసిల్దార్ ఆర్డర్ పై స్టే ఇస్తూ పిటిషన్ దారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూదాన్ భూమి స్వభావాన్ని మార్చడానికి వీలులేదని తెలుపుతూ తీర్పు ఇచ్చిందని తెలిపారు.

కొర్లపాటీ పరమేశ్వరి మరో 9 మంది పిటిషన్ దారులు కలిసి 2023 లో భూదాన్ భూములలో నిర్మించిన నిర్మాణాలను తొలగించకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై హైకోర్టు స్పందిస్తూ కోర్టుకు సమర్పించిన పట్టా వివరాలు సరిగ్గా లేవని, భూదాన్ భూములలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నట్లు దరఖాస్తు సమర్పించారని, పిటిషన్ దారులకు సంబంధించిన నిర్మాణాలను తొలగించవద్దని, నిర్మాణాలు లేకుండా మిగిలి ఉన్న భూమిలో ఎటువంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని స్టేటస్ కో జారీ చేసిందని అదనపు కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ భూదాన్ యజ్నా బోర్డు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిందని, జనవరి 17, 2026 నాడు సంబంధిత పిటిషన్ దారులకు ఎటువంటి కేటాయింపులు చేయలేదని, 5 ఎకరాలు కేజీబీవీ పాఠశాలకు, 5 ఎకరాలు మోడల్ స్కూల్ కోసం మాత్రమే కేటాయింపులు చేసినట్లు తేల్చిందని అన్నారు.

భూదాన్ భూములలో నివసిస్తున్న 308 ఆక్రమణదారులకు వెంటనే ఖాళీ చేయాలని జనవరి 17, 2026 న తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నోటీసులు జారీ చేసిందని అన్నారు. వెలుగుమట్లలో కొంతమంది ఆక్రమణదారులు 2014 లో తమకు అలాట్మెంట్ వచ్చినట్లు కాగితాలు చూపిస్తున్నారని, రికార్డుల పరిశీలనలో ఎటువంటి అలాట్మెంట్ చేయలేదని తేలిందని తెలిపారు.

తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఖమ్మం జిల్లా కలెక్టర్ కు సర్వే నెంబర్ 147, 148, 149 లో 2023లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు రిట్ పిటిషనర్ ఆవుల శిరీష సంబంధించిన నిర్మాణాలు మినహాయించి మిగిలిన భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ‌జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అధికారుల సహాయంతో వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన వారి నిర్మాణాలు మినహాయించి మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగింపు చేశామని అన్నారు.

వెలుగు మట్ల భూదాన్ భూములలో ఎవరికి ఎటువంటి అలాట్మెంట్ ప్రభుత్వం చేయలేదని , ప్రభుత్వం ఏకపక్షంగా పేదల ఇండ్ల నిర్మాణాలు కూల్చి వేస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలలో వాస్తవం లేదని, పలు మార్లు రికార్డులు పరిశీలించి విచారణ చేసిన తర్వాత తెలంగాణ భూదాన్ బోర్డు ఆదేశాల మేరకు నేడు ఆక్రమణల తొలగింపు చేపట్టామని అన్నారు.

జనవరి 17, 2026 నాడు తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆక్రమణదారులు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిందని, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోమని తెలిపినందున, తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగుమట్ల భూ దాన్ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి నేడు చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు.

అట్టి భూములలో కేజీబీవీ, ఆదర్శ పాఠశాల నిర్మాణానికి సంబంధించి కేటాయించిన 10 ఎకరాలు కాకుండా ఎటువంటి కేటాయింపులు చేయలేదని, ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనం మాత్రమే చేసుకుందని, ఈ భూమి భవిష్యత్తులో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అదనపు కలెక్టర్ అన్నారు.

ప్రస్తుతం నిరాశ్రయులైన వారికి కమ్మవారి సంఘంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు. భూదాన్ భూముల ఆక్రమణదారుల సామాగ్రి భద్రంగా అంబేద్కర్ భవనంలో స్టోర్ చేశామని, సంబంధిత ప్రజలు ఎక్కడికి ఆ సామాగ్రి తరలించాలంటే అక్కడికి తరలించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు.

*లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి ప్రసాద రావు మాట్లాడుతూ* భూ దాన్ భూముల కేటాయింపు సంబంధించి ప్రజల నుంచి కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని అన్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ పాత్రికేయులకు ఉన్న పలు సందేహాలకు సమాధానాలు తెలిపారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పీఎం శ్రీ హైస్కూల్లో ఎగ్జామ్ పాడ్స్ ఇచ్చిన మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. *మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం నాడు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పీఎం

Read More »

తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగు మట్ల భూములు స్వాధీనం…. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఆక్రమణదారుల సామాగ్రి అంబేద్కర్ భవనంలో భద్రపర్చాం వెలుగుమట్ల భూదాన్ భూములలో అక్రమ కట్టడాల తొలగింపుపై మీడియా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు

Read More »

ఉపవాసాల లక్ష్యం దైవభీతి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ఉపవాసాల లక్ష్యం దైవభీతి , తద్వారా మానవులలో నైతిక విలువల ప్రవర్తన తీర్చిదిద్దడం అని జమా ఆతే ఇస్లామీ హింద్ జిల్లా మహిళా పబ్లిక్ రిలేషన్ కన్వీనర్ హాజీరా

Read More »

అక్రమ రవాణా నివారించడం లో అంగన్వాడీ టీచర్స్ పాత్ర చాలా కీలకం

** -జిల్లా సంక్షేమ అధికారి – శ్రీమతి. విజేత -సీడీపీఓ వీర భద్రమ్మ ప్రజ్వల సమన్వయ కర్త సురేష్ కుమార్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, మహిళా

Read More »

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం నేటి గదర్ న్యూస్, ఖమ్మం : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామం మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి రెండు నెలల చిన్నారి పసిపాపను హత్య

Read More »

ఏసీబీకి పట్టుబడ్డ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్

హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సెక్షన్, టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఒక ఫిర్యాదుదారునికి చెందిన సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక

Read More »

 Don't Miss this News !