హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అత్తాకోడళ్లను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభించిన ప్రజాభిమానం, స్థానిక నాయకత్వం సమష్టి కృషి ఫలితమే ఈ విజయమని సీఎం ప్రశంసించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సమ్మ సమన్వయం పాలకుర్తిలో పార్టీని బలోపేతం చేస్తోందని కొనియాడారు.
పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సీఎం గారికి వివరించారు. ప్రగతి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.








