+91 95819 05907

డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసుల నమోదు… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సిఎంఆర్)లో ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం రూరల్ మండలం మంగలగూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ సిల్కీ సార్టెక్స్ రైస్ మిల్ యాజమాన్యం 2021–22 ఖరీఫ్, 2022–23 ఖరీఫ్, రబీ, 2023–24 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వానికి బియ్యం అందజేయడంలో విఫలమై 9.49 కోట్ల రూపాయలు అసలు బకాయి కలిగి ఉండగా, పెనాల్టీలతో కలిపి 13.84 కోట్ల వరకు డిఫాల్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మిల్లు మేనేజింగ్ భాగస్వామి కన్నేటి జ్యోతి, భాగస్వామి మామిడాల మానసపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. నెం. 129/2026 నమోదు చేయబడిందని అన్నారు.
అలాగే నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 2022–23 ఖరీఫ్, రబీ సీజన్లలో 7.59 కోట్ల అసలు బకాయి కలిగి ఉండగా, పెనాల్టీలతో కలిపి 10.88 కోట్ల వరకు డిఫాల్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మిల్లు యజమాని మేకల రామారావుపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. నెం. 47/2026 నమోదు చేసినట్లు తెలిపారు.ప్రభుత్వ ధాన్యం, నిధుల పరిరక్షణలో రాజీ పడబోమని, డిఫాల్ట్ చేసే మిల్లర్ల పై చట్టపరమైన కఠిన చర్యలు కొనసాగుతాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. బకాయిల వసూలు చర్యలు వేగవంతం చేయడంతో పాటు సంబంధిత శాఖల ద్వారా తదుపరి విచారణ కొనసాగుతున్నదని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫిబ్రవరి 27న దిశ సమావేశం నిర్వహణ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం: ఈ నెల 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా

Read More »

డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసుల నమోదు… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సిఎంఆర్)లో ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు

Read More »

నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి ◆మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి

*హైదరాబాద్* *మునుగోడులో నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి* *ప్రీజ్‌లో ఉన్న బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలి* *మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి* *హైదరాబాద్* , :తెలంగాణ

Read More »

పాలకుర్తి అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు

Read More »

హిందూ మతం ఎప్పుడు పుట్టింది*

* ? వ్యాసకర్త కె.ఎల్‌.కాంతారావు. నేటి గద్దర్ స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో మనమంతా హిందువులం, మనమంతా బంధువులం” అని ఇటీవల కొందరు అదేపనిగా నినాదాలిస్తున్నారు. అసలు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు హిందువులు అనే భావన

Read More »

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులకు ఆత్మ సౌజన్యంతో సహచర అభ్యాసం కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ

Read More »

 Don't Miss this News !