నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ఖమ్మం: ఈ నెల 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఫిబ్రవరి 27న జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశ కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించు దిశ సమావేశానికి గౌరవ సభ్యులు అందరూ హాజరు కావాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Post Views: 6








