నేటి గదర్ న్యూస్,పినపాక:రవాణా నియమ నిభందనలు పాటించాలని ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివప్రసాద్ అన్నారు.గురువారం మండలంలోని తోగ్గూడెం గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా,,,వాహనా దారులకు ట్రాఫిక్ నిభందనలు పై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,,, ప్రతి వాహన దారుడు వాహనాలు నడిపేట్టప్పడూ జాగ్రత్తలు పాటించాలని, సూచించారు.ద్వి చక్ర వాహన దారుడు హెల్మంట్ తప్పని సరిగా ధరించాలని తెలిపారు. హెల్మంట్ వాడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగనప్పుడూ తలకు గాయాలు కాకుండా రక్షణ గా ఉంటుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. మీరు వాహనాలు పై బయటకు వచ్చినప్పుడు,కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని ,క్షేమంగా ఇంటికి చేరాలంటే వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపిటిసి చింతపంటి సత్యం,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
///ఎంపిటిసి సత్యంను అభినందించిన: సి.ఐ శివ/// ప్రసాద్
తోగ్గూడెం ఎంపిటిసి చింతపంటి సత్యంను ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివ ప్రసాద్ అభినందించారు. తోగ్గూడెం గ్రామంలో మూల మలుపులు ఉండడంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,ప్రమాదాలు జరగకుండా మూల మలుపుల వద్ద ఎంపిటిసి చింతపంటి సత్యం ,వేగంను నియంత్రించేందకు స్టాప్ డ్రములను ఏర్పాటు చేయడం ఎంతో హర్షనీయమని అన్నారు.తెలంగాణ మహకుంభ మేళ అయన,ములుగు జిల్లా ,మేడారం సమ్మక్క,సారక్క జాతరకు ఎన్నో వాహనాలు పినపాక నుండి వెళ్తున్నాయని ,వాహనాలు వేగంను నియంత్రించేందకు స్టాప్ డ్రములు పెట్టడం వల్ల వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని తెలిపారు.