*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమస్యల సాధన కొరకు మొదటి దశ పోరాట కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. విధులలో పాల్గొంటూనే భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, మరియు కేజీ బీవీ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 34








