నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లెమడుగు విద్యార్థులు సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా
ప్రధానోపాధ్యాయులు కె.సాంబమూర్తి , పిడి బియ్యని కృష్ణయ్య ఒక ప్రకటన జారి చేస్తూ ఖమ్మం జిల్లా నుండి మొత్తం తొమ్మిది టీంలు పాల్గొనగా, నాకౌట్ లో వీవి పాలెం , మల్లెమడుగు ఫైనల్ చేరుకొని మల్లెమడుగు విద్యార్థులు సిల్వర్ మెడల్ సాధించారు. వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఏఎమ్ఓ పెసర ప్రభాకర్ రెడ్డి , ఇంటిలిజెన్సీ ఎస్సై ప్రవీణ్ , ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ , హెచ్ఎం లక్ష్మి నరసయ్య చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు .ఫుట్బాల్లో వరుస విజయాలతో జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధిస్తున్న మల్లెమడుగు విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు అలివేణి, పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి ,శారద, హేమలత, సుధాకర్, స్వర్ణలత, బ్రహ్మచారి, అమ్మాజీ, దేవమానమ్మ, సుజాత, వెంకటేశ్వరరావు, సహదేవ్,అరుణ, బాలమణి , 59, 60 డివిజన్ల కార్పొరేటర్స్ లలితా రాణి, నిరంజన్ కుమార్ గ్రామ పెద్దలు బోజర్ల సూర్యం, పీట్ల కృష్ణమూర్తి, కృష్ణ, వెంకయ్య, జానీ మియా, తిరుపతిరావు, తాటికొండ శ్రీనివాస్, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు








