భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ
ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని
డిమాండ్
అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా
కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న పోలీసులు
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన భూ బాధితులకు అంబేద్కర్ భవనంలో పరమార్శ అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకుడు విశారదన్ తో కలిసి , మూడు గంటల పాటు బైఠాయించి , తలపెట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం , భారీ ఎత్తున రెండు వైపుల ట్రాఫిక్ జామ్ కావడం నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి , ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుకున్న సమయం కు ఆలస్యంగా బిఆర్ అంబేద్కర్ భవనంలో ఆశ్రయం పొందుతున్న భూదాన భూ బాధితులను కవిత పరామర్శించారు. బాధితులకు వెలుగుమట్లలోని భూదాన భూమి లోనే ఇల్లు కట్టించాలని , జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తమ ఆందోళన , మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. ప్రభుత్వమంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఖమ్మం జిల్లా ప్రజల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్ర జల సమస్యలను పరిష్కరించలేకపోవటం విచారకరం అన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి , సమస్యను పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ బదులు ఆర్డిఓ రావడం సమస్య పరిష్కారం కాదన్నారు.
ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకులు విశారాధన్ మహారాజ్ ఇక్కడకు చేరుకొని , తమ కార్యకర్తలతో పాటు నినాదాలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కవిత , విశారాధన్ లు కొద్దిసేపు అంబేద్కర్ భవనం ప్రాంగణంలో ప్రసంగాలు చేశారు. అనంతరం అక్కడే నుండి జిల్లా పరిషత్ సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి , ధర్నా తలపెట్టారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా కొనసాగింది. ఆందోళనకారులు , పోలీసులు మధ్య తోపులాట జరిగింది. మూడు గంటల సమయం వరకు ధర్నా కొనసాగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రోడ్డుకు ఇరవైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఖరికి పోలీసులు సుమారు 25 మంది ఆందోళనకారులను , కవిత విశారదన్ లను అరెస్ట్ చేసి , ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.








