*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం డిమాండ్ చేశారు. సోమవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మన్యంలో నివసిస్తున్న ఆదివాసులను అక్కడ నుంచి తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు ఆదివాసుల జీవనం అడవితోనే ముడిపడి ఉందని అలాంటి వారిని అడవి నుండి తరిమేయాలని చూడడం సరైనది కాదని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫారెస్ట్ అధికారులు వీరిని అడవుల నుంచి మైదాన ప్రాంతాలకు తరిమేయాలని చూస్తున్నారని అన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం వంత పాడటం ద్వారానే ఫారెస్ట్ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా గిరిజన చట్టాలను పకడ్బంధింగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణ, ధోని నాగేశ్వరరావు, కల్తీ వెంకటేశ్వర్లు, సతీష్, సంధ్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు








