+91 95819 05907

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి :మంత్రి Dr సీతక్క

– ములుగు నియోజక వర్గ అభివృద్ధి నా బాధ్యత బలరాం నాయక్ గారిని గెలిపించే బాధ్యత మీది

– బిల్ట్ ఫ్యాక్టరి తెరిపించి మంగపేట మండలాన్ని అభివృద్ధి చేసి తీరుతాం

– ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం

– మీరు ఆశీర్వదిస్తే మంత్రిని అయిన ములుగు నియోజక వర్గం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా

– కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండు కావాలని బిజెపి చూస్తుంది

– మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి.

– 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ 2లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.

– బిజెపి,బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మద్దు మోసపోవద్దు

– ప్రభుత్వ సంస్థలను అమ్మే బిజెపి కావాలా…. దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచన చేయాలి.

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
నేటి గద్ధర్ న్యూస్,ములుగు
మంగపేట మండలం లోని బ్రహ్మణ పల్లి చెక్ పోస్ట్ నుండి ఏటూరు నాగారం వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఏడాదికి 42 రోజులె పని కల్పిస్తుంది అని మళ్ళీ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడం తో పాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు భూములు పంచినం ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చినాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పేదల పక్షాన నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది బిజెపి
బిఆర్ఎస్ లు 10 యేండ్లు పాలించి ఏ ఒక్క పేదవాడికి న్యాయం చెయ్యలేదని నరేంద్ర మోడీ ఏ చట్టాలు తీసుకచ్చిన వాటికి మద్దతు తెలిపింది
బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కాదా ఒక్కసారి ప్రజలు ఆలోచించండి
కెసిఆర్ 10 యేండ్ల లో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ లక్షల కోట్లు అప్పు చేశాడు అని
ప్రభుత్వ రంగ సంస్థలు నీ తన స్వలాభం కోసం ఆయన మిత్రులకు కట్టబెట్టి పేదల నడ్డి విరిచారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండు కొవాలని బిజెపి చూస్తుందని ప్రజలందరూ బిజెపి ఎత్తుగడలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు
మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ గారి లక్ష్యం
మీరు బలరాం నాయక్ గారికి తోడుగా నిలవండి…. నేను మీకు అండగా ఉంటాను…
యువకుల బలిదానాలు చూసి సోనియామ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.కానీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ దుర్మార్గపు పాలనతో సర్వనాశనం చెశారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
10ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, ఆక్రమాలు తప్ప ఏమి లేదు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో 5న్యాయలతో ప్రజలకు న్యాయం జరుగుతుంది
అసెంబ్లీ ఎన్నికలలో 6గ్యారంటీలు ఇచ్చాము
ఇప్పటికే 5గ్యారంటీలను అమలు చేశాం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని మన ప్రాంత బిడ్డ గతములో కేంద్ర మంత్రి గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మంత్రి సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !