★12 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న అద్దె వాహనాల బిల్లులు చెల్లించాలని డిమాండ్
నేటి గదర్ వెబ్ డెస్క్ ,వరంగల్ :
వరంగల్ , హన్మకొండ జిల్లాలో డి ఎం హెచ్ ఓ, ఆఫీసు ప్రోగ్రాం ఆఫీసర్లకు పెట్టిన అద్దె వెహికల్స్ బిల్లులు చెల్లించాలని మంగళవారం DM & HO కార్యాలయం ముందు అద్దె వాహనాల డ్రైవర్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా వాహనాల డ్రైవర్లు మాట్లాడుతూ… 12 నెలల నుండి తమ వాహనాలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరి వాహనాల కిస్తీలు ప్రతినెల చెల్లించవలసి వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిగా మారిందని, పిల్లలు బడి ఫీజులు, అలాగే ఈ.ఎమ్.ఐ కట్టలేక , బయట తెచ్చిన అప్పుకు వడ్డీ చెల్లించలేక నాన్న ఇబ్బందులకు గురికావలసిన దుస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 12 నెలల పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని వేడుకుంటున్నారు .ఈ కార్యక్రమంలో వరంగల్ , హన్మకొండ జిల్లా అద్దె వాహనాల డ్రైవర్స్ మహేందర్, బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.