రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జూలై 11:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తెలంగాణ మోడల్ కాలేజీ హాస్టల్ లో అల్పాహారం ఉప్మా తిని 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనతో జిల్లా డీఎంహెచ్వో శ్రీరామ్ బుధవారం రోజు సందర్శించారు.ఆయన ఆదేశాల మేరకు గురువారం రోజు మండల వైద్యాధికారిణి డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.హాస్టల్లో గదులవారీగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో ఉదయం పూట బ్లీచింగ్ పౌడర్ ను పిచికారి చేయించామని తెలిపారు.అనంతరం హాస్టల్ చుట్టుపక్కల పరిసరాలలో దోమలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా దోమల మందును పిచికారి చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.అదేవిధంగా ఈ వర్షాకాలం సీజన్లో హాస్టల్ విద్యార్థులకు మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా హాస్టల్ సిబ్బంది పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలియపరచారు.