◆పోచారం, నారపల్లి, ఇస్మాయిల్ ఖాన్ గూడ, అన్నోజిగూడలలో నిర్వహించిన తైబజార్ ల బహిరంగ వేలం
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి (హైదరాబాద్)ఉపేందర్
:
మేడ్చల్ జిల్లా పోచారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో తై బజారు వేలంపాట నిర్వహించడం జరిగినది. పురపాలక సంఘం పరిధిలోని పోచారం, నారపల్లి, ఇస్మాయిల్ ఖాన్ గూడ, అన్నోజిగూడ, గ్రామాలలో తైబజార్ వేలం నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానించగా గడువు ముగిసిన10వ తేదీ నాటికి 03 మంది దరఖాస్తులు మున్సిపాలిటీ వారికి అందిన మరుసటిరోజు 11వ తేదీ గురువారం ఉదయం గం.10:30 నిమిషలకు చైర్ పర్సన్ బోయపల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ పి. వేమన రెడ్డి పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పోచారం పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి తైబజార్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి తైబజార్ గడువు 9 నెలల వరకే ఉంటుంది అని వేలం పాటలో పాల్గొన్న సభ్యులకు తెలియజేయనైనది. ఈ వేలం పాటలో దరఖాస్తు చేసుకున్న 03 మంది అభ్యర్థులు పాల్గొనడం జరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి నిర్ణయించిన తైబజార్ అప్సెట్ ధర రూ.5,65,125/- ల నుండి వేలం పాట ప్రారంభించబడింది. వేలం పాటలో పాల్గొన్న వారిలో కొక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ తండ్రి రాజయ్య, నివాసము ఇంటి నెం. 4-300/235, అన్నోజీగూడ అత్యధికంగా వేలం పాడి రూ.5,67,000/- (ఐదు లక్షల అరవై ఏడు వేలు రూపాయలు) వేలం పాట పాడి తైబజార్ హక్కులు పొందినారు. ఇట్టి వేలం పాటలో గౌరవ వైస్ చైర్మన్ నానావత్ రెడ్యా నాయక్ , గౌరవ కమిషనర్ పి వేమన రెడ్డి , కౌన్సిల్ సభ్యులు గొంగళ్ళ మహేష్ , సింగిరెడ్డి సాయి రెడ్డి , బెజ్జంకి హరి ప్రసాద్ రావు , సుర్వి రవీందర్, కోఆప్షన్ సభ్యులు అక్రమ్ ఆలీ మున్సిపల్ మేనేజర్ కిరణ్ , ఆర్.ఐ. సాయి రాజ్ మున్సిపల్ సిబ్బంది తదితరులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు.