నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా నగరమంతా తడిసి ముద్దైంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్ పల్లి, మూసాపేట్, హైదర్ నగర్, కేపీహెచ్బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతినగర్, చర్లపల్లి, కీసర, సికింద్రాబాద్, నిజాంపేట్, నేరేడ్ మెట్, టోలీచౌకీ, షేక్ పేట్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇంకా మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ చెప్పింది.
Post Views: 20