ఆటో డ్రైవర్ల సమావేశంలో ఎస్సై రాణా ప్రతాప్
జూలూరుపాడు, జూలై 14, నేటి గద్దర్ : ఆటోలలో ప్రయాణించే మహిళల పట్ల గౌరవంగా మెలగాలని, ఆడవారితో అనుచితంగా ప్రవర్తించకూడదని జూలూరుపాడు ఎస్సై బి రాణా ప్రతాప్ ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, విధిగా యూనిఫామ్ ధరించాలని, ర్యాష్ డ్రైవింగ్ చెయ్యకూడదని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ నూతన చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నీ ఆటో డ్రైవర్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 146









