నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
హైదరాబాద్ కూకట్‌పల్లి 4th ఫేజ్‌లో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ ఇవ్వాలని కండక్టర్‌ను అడిగింది. ఆధార్ కార్డులో అడ్రస్ మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని ఉంది. రాష్ట్రం స్థానంలో తెలంగాణ ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ఉన్నందున ఫ్రీ టికెట్ ఇవ్వనని కండక్టర్.. ప్రయాణికురాలికి తేల్చిచెప్పాడు. తాను తెలంగాణకు చెందిన మహిళనని చెప్పినా, డబ్బులిచ్చి టికెట్ కొనాల్సిందేనని లేదంటే బస్సు దిగి వెళ్లిపోవాలన్నాడు. దీంతో ప్రయాణికురాలు డబ్బులిచ్చి టికెట్ తీసుకుంది. కండక్టర్ తీరుపై ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు విన్నవించింది.
Post Views: 231









