+91 95819 05907

జగన్నాధుని రత్న భండార్ మూడో గదిలో ఏముంది?

సోర్స్ :నివాస్ న్యూస్

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
జూలై 14 ఒడిశా ఒడిశాలోని పూరి జగన్నా థుడి రత్న భాండాగారం నిధి లెక్కింపు మరింత ఆలస్యం కానుంది. భాండాగారం మూడో గది తాళం తెరుచుకోకపోవ డంతో కట్టర్స్ సాయంతో తెరిచినట్లు అధికారులు తెలిపారు. గది లోపలకి వెళ్లకుండా కొత్త తాళం వేసినట్లు చెప్పారు. మూడో గదికి మళ్లీ సీల్ వేశారు. కమిటీ మీటింగ్ తర్వాత మళ్లీ గది తలుపులు తెరుస్తామని ప్రకటించారు. మిగిలిన రెండు గదుల్లో దేవుడికి రెగులర్ గా ఉపయోగించే బంగారాన్ని లాకర్ లో భద్రపరిచినట్లు తెలిపారు. రత్న భాండాగారం మూడో గది తాళాలు పని చేయక పోవడంతో భారీ కట్టర్ మిష న్లతో తాళాలను ఆలయ సిబ్బంది కట్ చేశారు. కాగా, సమయాభావంతో గది తలుపులకు కొత్త తాళం అమర్చింది హైలెవెల్ కమిటీ. రేపు (జూలై 15) రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండటంతో తాత్కాలికంగా రత్న భాండాగారం మదింపు కార్యక్రమం నిలిపివేశారు. మరోసారి హైలెవెల్ కమిటీ భేటీ తర్వాత సమయం నిర్ణయిస్తామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి అరవింద్ పాడి, హైలెవెల్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ విశ్వనాధ్ రధ్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాళాన్ని జిల్లా ఖజానా కార్యాలయంలో అధికారు లు భద్రపరచనున్నారు. పాత తాళంతోనే మొదటి రెండు డోర్లు ఓపెన్ చేశాం. మూడో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా ఓపెన్ కాలేదు. దాంతో భారీ కట్టర్ల సాయంతో లాక్ కట్ చేశాం. లాక్ కట్ చేసిన తర్వాత సమయం మించిపోయింది. దాంతో ఆ గది లోపలికి వెళ్లలేదు. వెంటనే తలు పులు వేసి కొత్త తాళం బిగించాం. ఆ తాళాన్ని భద్రపరిచాం’ అని అధికారులు తెలిపారు. కాగా, 1978లో పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని చివరిసారిగా తెరిచారు. 70 రోజుల పాటు సంపద లెక్కింపు జరిగింది. 128 కిలోల 454 బంగారు ఆభరణాలు, 221 కిలోల 293 వెండి ఆభరణాలు గుర్తించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !