*మహిళా కూలీలకు పొంగులేటి ఆప్యాయ పలకరింపు*
*ఎంవీ. పాలెం వద్ద కాన్వాయ్ ఆపి మాటా మంతి*
నేటి గదర్ న్యూస్ , జులై 14 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఎక్కడ ఉన్నా ..ఆయన ఆప్యాయతలో ఎప్పుడు అదే ప్రేమ …ఎంపీ నుండి నేడు రాష్ట్ర మంత్రి అయిన జనాల మీద ప్రేమ తగ్గలేదు… ఏరా చెల్లెమ్మా.. ఎలా ఉన్నారు. పైరు బాగుంది. కలుపు తీస్తున్నారా..?” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఎంవీ. పాలెం గ్రామం సమీపంలో మహిళా రైతు కూలీలతో ఇలా మాట్లాడారు. ఆరెంపులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తనగంపాడు వెళుతూ.. ఇలా రోడ్డు వెంట ఓ పత్తి చేను వద్ద ఆగారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడుతూ.. సాగు ఎలా ఉంది..? సొంత భూమి నా..? కౌలుకు చేస్తున్నారా అంటూ.. ఆరా తీశారు. పిల్లలు ఏం చేస్తున్నారు.. బాగా చదివించండి.. మన ప్రభుత్వంలో అందర్నీ ఆదుకుంటాం.. అంటూ ఆప్యాయంగా భరోసా ఇచ్చారు. సాక్షాత్తూ మంత్రినే తమ వద్దకు వచ్చి ఇలా మాట్లాడటం తో.. ఆ మహిళలు ఎంతో ఆనందించారు.









