మెదక్ (నేటి గదర్ ప్రతినిధి)
మెదక్ కలెక్టరేట్లో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి సంఘం మెదక్ అధ్యక్షుడు కోడూరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయుల యొక్క ఈ.హెచ్.ఎస్ ను అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అమలు పరచాలని అదేవిధంగా రూపాయలు 398/- వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నేషనల్ ఇంక్రిమెంట్ పెన్షనర్ బెనిఫిట్ కల్పించాలని మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులో జాప్యం లేకుండా చెల్లించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రిటైర్డ్ ఉద్యోగులు కోడూరు నరసింహారెడ్డి తో పాటు మంగా బాలేశ్వర్ గౌడ్,దాస జీవరత్నం ,కొండ యేళ్ల బాగయ్య ,తొగుట వెంకటేశం ,నరేందర్ రెడ్డి లతోపాటు వెంకన్న గౌడ్ పాల్గొన్నారు
Post Views: 93