+91 95819 05907

భూ కబ్జా అక్రమ నిర్మాణం పై బాధితుల ఆక్రందన…

  • భూ కబ్జా అక్రమ నిర్మాణం పై బాధితుల ఆక్రందన.
  •  సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్.
  •  నిలుపుదలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు సూచన.
  •  సిపి కు సమాచారం పై హామీ.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.

తమభూమిని బలవంతంగా కబ్జా చేయడమే కాకుండా వాసిరెడ్డి శ్రీనివాసరావు, కోన గోవిందరావు , తమ్మారపు లక్ష్మణ్ అనే వ్యక్తులు అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారని బాధితులు చేపూరి పద్మ శ్రావణి , నైనిషా, నవ జ్యో త్ సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎదుట తమ ఆక్రందన వినిపించగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వివిధ సంఘాల నాయకులు , బాధితులు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు నిలుపుదల చేయాలని సూచిస్తానని పేర్కొన్నట్లు వివరించారు. అదేవిధంగా ఈ అంశంపై సి పి కు సైతం తగిన సమాచారం పంపుతాను అన్నారు. వివిధ సంఘాల నాయకులు , బాధితుల కథనం మేరకు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 494 లో వచ్చే రోటరీ నగర్ అంతర్భాగ శ్రీ నగర్ రోడ్డు నెంబర్ 15 , సందులో 15 / 02 / 13 లో బాధితులు నివసిస్తున్నారు. ఈ సర్వే నెంబరు పరిధిలో 13 సంవత్సరాల క్రితం మూడు ఎకరాల 1. 33 కుంటల స్థలాన్ని చేపురి పద్మ , చేపురి సంధ్యారాణిలు కొనుగోలు చేశారు. కాగా ఈ భూమి తమదని గత కొంతకాలంగా తమకు అన్ని విధాలుగా వేధిస్తున్న వాసిరెడ్డి శ్రీనివాసరావు , కోన గోవిందరావు ,తమ్మరపు లక్ష్మణ్ లు ఇటీవల తమ భూమిని బలవంతంగా ఆక్రమించుకొని , ఆ భూమిలో అక్రమ నిర్మాణం మొదలు పెట్టారని అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా , హైకోర్టు లలో కేసు నడుస్తూ , తుది తీర్పు పెండింగ్ లో ఉండగా ఇరుపక్షాలు ఆ స్థలంలో వెళ్లకూడదనే నియమ నిబంధన ఉన్నప్పటికీ సదరు నిందితులు వీటిని అతిక్రమించి, స్థలం కబ్జా చేయడంతో పాటు అక్రమ నిర్మాణాలను మొదలుపెట్టారని తెలిపారు. ప్రశాంతమైన ఖమ్మం నగరంలో ఇటువంటి చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు , ఉన్నత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి, తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన బృందంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి. కృష్ణారావు , సీనియర్ ఉద్యమకారులు పగడాల నరేందర్ , మందడపు శంకర్రావు , రాచమల్ల ఉమా యాదవ్ , మహాత్మా జ్యోతిబా పూలే సొసైటీ అధ్యక్షులు పెల్లూరి విజయకుమార్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , ఎంబీసీ చైర్మన్ బాసాటి హనుమంతరావు , ఉద్యమకారులు రెడ్డి బోయిన వరలక్ష్మి , బా లిన భాస్కర్ రెడ్డి , బుఖ్య శ్రీనివాస్ నాయక్ , దేవల్ల నాగేశ్వరావు , జల్లిపల్లి సైదులు , తాడొజు వెంకట చారి , శ్రీనివాస్ , నాగేశ్వరరావు , అనంతలక్ష్మి ,స్వరూప , ధనలక్ష్మి ,ఆకారపు కృష్ణవేణి ,దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , పద్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !