నేటి గద్దర్ ఏటూర్ నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో కి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుండెబ్బ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్ భూభాగంలోని భారత రాజ్యాంగ చట్టాలను పరిరక్షిస్తూ, ఆదివాసి ప్రజల సంక్షేమ అభివృద్ధి కొరకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సాంఘిక, సామాజిక రంగాలలో ప్రభుత్వం చేపట్టిన జీవోలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీని రద్దు చేయాలి.
ఐదవ షెడ్యూల్డ్ ఏరియాలో విద్యాభివృద్ధి కొరకు 1986 సంవత్సరములో విద్యతోపాటు స్థానిక గిరిజనులచే 100% ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగించాలని జీవో తీసుకురావడం జరిగినది. దీనిని కి అణువునంగా ప్రభుత్వం 100% రిజర్వేషన్ కల్పిస్తూ డీఎస్సీని నిర్వహించాలని కోరుతున్నాము.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా 29 ప్రభుత్వ శాఖలను నిర్వహిస్తున్నది. ఈ యొక్క శాఖలలో ఉద్యోగ భర్తీ కొరకు 29 జీవోలు తీసుకువచ్చి రిజర్వేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించినది. ఈ యొక్క జీవోలను ఉద్యోగ నోటిఫికేషన్ లో కచ్చితంగా అమలు చేయాలని కోరుచున్నాము.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మరియు ఆదివాసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డులను నిర్వహిస్తామని ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటన చెయ్యడం జరిగినది. ఈ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలి ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాము.
29 ప్రభుత్వ శాఖలలో ఉన్న స్థానిక ఉద్యోగ భద్రత జీవోలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ద్వారా చట్టం చేయాలని కోరుచున్నాము.
ఏజెన్సీ ప్రాంతంలోని భూములు అన్యాయక్రాంతం కాకుండా 1/70 కచ్చితంగా అమలు చేయాలని కోరుచున్నాము.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ప్రజలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలని కోరుచున్నాము.
ఆదివాసి ప్రాంతాలకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్లు కేటాయించాలి.
గోదావరి పర్యావహక ప్రాంతంలోని అక్రమ ఇసుక రవాణా నిలిపివేయాలి.
ఆశ్రమ పాఠశాలలలో సీఆర్టీలుగా పనిచేస్తున్నటువంటి వారిని రెగ్యులర్ టీచర్లుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుచున్నాము.
ఆశ్రమ హాస్టల్స్ లో పనిచేస్తున్న కాంటినెంట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో పొడెం రత్నం ఇప్పుడు దెబ్బ జాతీయ కన్వీనర్, కబ్బాక శ్రావణ్ కుమార్ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చింత కృష్ణ ప్రచార కార్యదర్శి, పొదెం రవీందర్ ఆదివాసి కాంట్రాక్ట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, వట్టం జనార్ధన్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు, చందా మహేష్ తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎట్టి రాజబాబు జిల్లా ఉపాధ్యక్షులు, సిద్దబోయిన సర్వేశ్వరరావు జిల్లా కార్యదర్శి, కాపుల సమ్మయ్య జిల్లా కార్యదర్శి, వట్టం సురేష్ జిల్లా కార్యదర్శి, తాటి నీలాద్రి ఏటూర్ నాగారం మండల ప్రధాన కార్యదర్శి, డబ్బుల ముత్యాలరావు మంగపేట మండల అధ్యక్షులు, ఆగబోయిన చంద్రకాంత్ మంగపేట మండలం ప్రధాన కార్యదర్శి, తాటి మహేష్ ఏటుర్ నాగారం మండలం ఉపాధ్యక్షులు, సువర్ణపాక వెంకటరత్నం గంగారం మండల అధ్యక్షులు, పూణెం సందీప్ కుమార్ కొత్తగూడా మండల అధ్యక్షులు, కెక్కం వినోద్ కుమార్ గ్రాడ్యుయేట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్, కొడిపే అరుణ్ మండల సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.