+91 95819 05907

తెలంగాణ రాష్ట్రం ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయాలి

◆ఏఐటియుసి కొమరం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్(ఆసిఫాబాద్ జిల్లా) :

తెలంగాణ రాష్ట్రంలోని NHM స్కీంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేసారు,పని ఒత్తిడి తగ్గించాలని ఈనెల 18వ తేదీన కమిషనర్ కార్యాలయం ఎదుటజరిగే ధర్నా కార్యక్రమాన్ని జిల్లాలోని రెండవ ఏఎన్ఎంలులు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు,సోమవారం రోజున కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సుజిత్ కి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం ఆగస్టు నెలలో మమ్మల్ని బే షరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె చేసిన విషయం తమకు విధేయతమే. సమ్మె సందర్భంగా జరిగిన చర్చల్లో మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి, లేదా గ్రాస్ శాలరీ ఇవ్వడానికి, మా పని ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం 02-09-2023 న ఒక కమిటీని వేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ కమిటీ ఇంతవరకు సమావేశము అవ్వకపోగా సమ్మె విరమించిన నాలుగు రోజుల నుండి మాకు కొత్త ఏ పి పి లను తీసుకురావడం జరిగింది. నాలుగు కొత్త ఏపిపిలు రావడం కారణంగా గతంలో ఉన్న పని ఒత్తిడి కంటే ఇప్పుడు ఇంకా పెరిగింది. అందుకనే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో పనిచేస్తున్న రెండవ ANMలను రెగ్యులర్ చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన కమీషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తమకు తెలియజేస్తున్నాం. కనుక గమనించగలరు.ఈ కార్యక్రమంలో 2వ ఏఎన్ఎం ల సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి ప్రమీల,రెండవ లు సునీత,వనిత, విజయ లక్ష్మి, పద్మ, తులసి పాల్గొన్నారు

డిమాండ్స్:

1) తెలంగాణా రాష్ట్రం లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను భేషరతుగా రెగ్యులర్ చేయాలి..

2) ఒకవేళ పరీక్ష పెట్టాల్సివస్తే పోస్టులను పెంచి గతంలో ఇచ్చిన హామీల ప్రకారమే ఏజ్ రిలాక్స్, 30% వైటేజీని ఇచ్చి పెట్టాలి.

3) పీ ఆర్ సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

4) పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా ఈ రెండవ ఎఎన్ఎంలకు కూడా ప్రతి నెల 1 వ తేదీనా జీతాలు చెల్లించాలి.

5) ఎన్ సి డి స్క్రీనింగ్ నుండి రెండో ఏఎన్ఎం లను మినహాయించాలి.

6) 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరైనా ఏఎన్ఎంలు దురదృష్టవశాస్తూ మరణిస్తే 10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించాలి.

7) పరీక్ష రాయటానికి అవకాశం లేనటువంటి 53 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి రిటైర్మెంట్ అయ్యే సమయంలో ఐదు లక్షల రూపాయల లైఫ్ టైం గ్రాట్యుటీని అందించాలి.

8) రెగ్యులర్ అయ్యేంతవరకు పిహెచ్సీలో ఫస్ట్ ఏఎన్ఎం లేని సబ్ సెంటర్లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంకు 10000 రూపాయలు అదనపు వేతనాన్ని అందించాలి.

9) యుపిహెచ్సిలో ఒకే ఏఎన్ఎం పనిచేస్తున్న చోట 15వేల రూపాయల అదనపు వేతనాన్ని అందించాలి.

10) యుపి హెచ్సీలో కూడా ఒక సబ్ సెంటర్కు జనాభాను 5 వేలకు తగ్గించాలి..

11) ప్రతి సంవత్సరానికి రూ.4,500 యూనిఫామ్ అలవెన్స్ అందించాలి.

12) పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా ఈ రెండవ ఎఎన్ఎంలకు కూడా సెలవులు మంజూరు చేయాలి.

13) ఎవరైనా కాంట్రాక్ట్ ఏఎన్ఎం దురదృష్టవశాస్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరు నెలల లోపు కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ బేసిస్ లో అయినా ఉద్యోగాన్ని అందించాలి.

14) నల్లగొండ జిల్లాలో ప్రవేశపెట్టిన జియో ట్యాగ్ నుండి ఫీల్డ్ స్టాప్ అయినా ఏఎన్ఎం లను మినయాయించాలి.

15) కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి కూడా బదిలీలకు అవకాశం కల్పించాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !