అధికారుల కళ్లుగప్పి మూగ జీవాల అక్రమ రవాణా
★క్రూరాతి,క్రూరంగా హింసిస్తూ పశువుల మెడలను విరుస్తూ…
★ మెడలను వంచి కాళ్ళను విరగగొట్టి తాళ్లతో బంధించి వ్యాన్ లలో సుదూర ప్రాంతాలకు తరలింపు
★చర్ల కేంద్రం గా పశువుల అక్రమ రవాణా సాధారణమే:చర్ల మండల ప్రజలు
★ మూగజీవాలను హింసిస్తున్న పట్టించుకోని అధికారులు
★ జిల్లా ఎస్పీ దృష్టి సారించేనా?
చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో కేంద్రంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పశువుల రవాణా జోరుగా కొనసాగుతుంది వివరాలు పరిశీలిస్తే చర్ల నుండి కొందరు వ్యాపారులు చత్తీస్గడ్ ప్రాంతాల నుండి గిరిజనుల దగ్గర అతి తక్కువ ధరలకు పశువులు కొనుగోలు. చేస్తూ అక్కడి నుండి కాలినడక ద్వారా చర్ల మండలానికి తరలించి అడ్డాలుగా ఏర్పాటు. చేసుకొని అదును చూసుకొని రాత్రి వేళల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా ను కొనసాగిస్తున్నారు. ఈ పశువుల అక్రమ రవాణాలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రూరాతి,క్రూరంగా హింసిస్తూ పశువుల మెడలను విరుస్తూ వాటి మెడలను వంచి కాళ్ళను విరగగొట్టి తాళ్లతో బంధించి డీసీఎం, బొలెరో, వంటి భారీ వాహనాల్లో అధిక సంఖ్యలో పశువులను రవాణా చేస్తూ పశువులను హింసిస్తున్నారు. జంతు సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా మూగ జీవాలను హింశించడం.నేరమని చట్టాలు చెబుతున్నా చర్ల మండలంలో మాత్రం ఈ చట్టాలు పనిచేయడం లేదు. ఈ అక్రమ రవాణా అనేది కూడా ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. ఇకనైనా ఈ అక్రమ పశువుల రవాణాను చర్ల మండల కేంద్రంగా అక్రమ పశువులు రవాణాలో జరిగే మూగ హింసపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు.









