+91 95819 05907

రాయల కు గజ మాలతో ఘన స్వాగతం: చైర్మన్ హోదాలో తొలిసారిగా రాయల ఖమ్మం రాక

.

★ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.

★పైనంపల్లి నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ..

★గిడ్డంగులను రైతులకు అందుబాటులోకి తెస్తా..రాయల నాగేశ్వరరావు

నేటి గదర్ న్యూస్ , జులై 16(పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ హోదాలో తొలి సారిగా ఖమ్మం వస్తున్న రాయల నాగేశ్వరరావు కు
జిల్లా సరిహద్దు నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిడ్డంగులను రైతులకు అందుబాటులోకి తీచుకొస్తా అన్నారు. తనపై నమ్మకం ఉంచి నాకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు జిల్లా మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను రైతు బిడ్డగా రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. మరిన్ని నూతన గిడ్డంగులు నిర్మించేందుకు కృషి చేస్తానని రాయల నాగేశ్వరరావు అన్నారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో నేలకొండపల్లి మీదుగా ముదిగొండ మండలం వెంకటాపురం లోని పంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ తన మాతృ మూర్తి రాయల కమలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి రెడ్డి భవన్ కు చేరుకున్న రాయల.. అక్కడ కొద్దిసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. అక్కడ నుంచి మామిళ్లగూడెం లోని వివిసి పంక్షన్ హాల్లో బంధు, మిత్రులు ఏర్పాటు చేసిన అభినందన సభలో రాయల పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !