రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 16:- మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన బాజే లావణ్య భర్త గణేష్ అనే మహిళ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి స్కూటీ పై వస్తు తూప్రాన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించింది.ఈ విషయం తెలవగానే ఆ రోజు మైనంపల్లి హన్మంతరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ రోజు చనిపోయిన లావణ్య కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నందున వారి భవిష్యత్తు కోసం ఒక లక్ష రూపాయల ఫిక్స్ డిపాజిట్ కు ఆమె భర్త గణేష్ కు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మైనంపల్లి వాణి అందచేసారు.
Post Views: 81









