కొత్తగూడెం మున్సిపాలిటీ ఖజానాకు గండి కొడితే ఉపేక్షించేది లేదు -కాంగ్రెస్ పార్టీ నాయకులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో అనేక రకాలుగా నిధులు దుర్వినియోగం జరుగుతున్న మాట వాస్తవం కదా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జేబీ శౌరి ఆరోపించారు.ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోగల వారాంతపు సంత టెండర్ ప్రక్రియ నిర్వహించాల్సిన కనీస పద్ధతులు పాటించకుండా ఏకపక్షంగా నిర్వహించడం జరిగింది.టెండర్ పిలిచే ముందు పాటించవలసిన కనీస నిబంధనలు పాటించకుండా..అత్యధిక సర్కులేషన్ ఉన్నటువంటి పేపర్లలో ప్రకటన వేయించడం, మైక్ సెట్ పెట్టి మున్సిపాలిటీ మొత్తం ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నిబంధనలు ఏమి కూడా పాటించడం లేదన్నారు.
ఇదే వారాంతపు సంత పూర్వం 50 లక్షలు, అంతకు పూర్వం 70 లక్షల కు వరకు కూడా పాట జరగడం జరిగింది. కానీ ఈసారి 8 లక్షలకు మాత్రమే వారాంతపు సంత పాట అయినట్లుగా మున్సిపల్ అధికారులు ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీకి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే చోద్యం చూస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం ఏమి చేస్తున్నట్లు అలాగే అన్ని విషయాలపై సమన్యాయం చేయవలసిన కమిషనర్ ఏం చేస్తున్నారు ?అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మున్సిపాలిటీలో అనేక రకాలుగా అక్రమాలు జరుగుతున్నవి కనుక దీనిపై సమగ్ర విచారణ చేసి టెండర్ రద్దుచేసి బాధ్యులపై చర్యలు అదనపు కలెక్టర్ విద్యా చందన కి నివేదిక సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కూసపాటి శ్రీనివాస్,కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, జిల్లా NSUI అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, చుంచుపల్లి ఎస్సీ సెల్ నాయకులు భూపతి అశోక్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎలకపల్లి లక్ష్మయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తుం పూరి శివ తదితరులు పాల్గొన్నారు.









