నేటి గదర్, జూలై 16,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపితే కేసులు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ట్రాక్టర్ ను ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాహనదారులు తమ వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోవాలని, ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అన్ని వైపులా అతికించాలని తెలిపారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
Post Views: 1,889









