చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్ట్ ను సందర్శించి, డ్యాం నీటి సామర్థ్య పెరగడం వలన గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.తాలిపేరు ప్రాజెక్టు ఆఫీసుని సందర్శించి సీసీ కెమెరాలు పర్యవేక్షించారు.దిగువన ఉన్న గ్రామాలకు ముందస్తుగా సమాచారాన్ని తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చర్ల మండల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 439









