★మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి
నేటి గదర్ న్యూస్ , జులై 17 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
రేపటి నుండి రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీని హర్షిస్తూ పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాలుగు మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి ట్రాక్టర్ ర్యాలీలకు పిలుపునిచ్చినట్టు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి మండలంలో సత్యసాయిబాబా ఆలయం నుండి నేలకొండపల్లి మార్కెట్ యాడ్ వద్ద గల రైతు వేదిక వరకు, కూసుమంచి మండలంలో పాలేరు నుండి కూసుమంచి రైతు వేదిక వరకు, ఖమ్మం రూరల్ మండలంలో మద్దులపల్లి నుంచి పొన్నెకల్ రైతు వేదిక వరకు, తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు నుండి దమ్మాయిగూడెం రైతు వేదిక వరకు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ర్యాలీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయా రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో లబ్దిదారులు, రైతులు పాల్గొంటారన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించి నేరుగా లబ్ధిదారులు, రైతులతో ప్రసంగిస్తారని తెలిపారు. కావున నాలుగు మండలాలకు చెందిన రుణమాఫీ లబ్ధిదారులు, రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దయాకర్ రెడ్డి కోరారు.









