నేటి గదర్ న్యూస్ జులై 17:వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
అతను ఓ ఆటో డ్రైవర్ సాయం చేయాలని గుణం ఉన్నది తనకు ఉన్న ఆటోను సేవా కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడు.నిండు గర్భిణీ కనిపిస్తే చాలు ఇంటి నుండి హాస్పిటల్ కు,హాస్పటల్ నుండి ఇంటికి తీసుకుపోతాడు. సహాయం చేసే గుణం ఉండాలి కానీ డబ్బు అవసరం లేదంటున్నాడు.
వైరా మండలం సిరిపురం కేజీ గ్రామానికి చెందిన షేక్ లతీఫ్ గర్భిణీ స్త్రీలకు ఉచిత సర్వీస్ చేస్తూ ఆటోలో గరికపాడు గ్రామానికి చెందిన పంతంగి రేణుకా గర్భిణీ స్త్రీని ఈరోజు తో ఆరుసార్లు వైరా హాస్పిటల్ కు తీసుకువెళ్లినాడు.
గర్భిణీ స్త్రీలకు గత నాలుగు సంవత్సరాలు నుండి 200 మందికి పైగా వైరా చుట్టుపక్క గ్రామా ల నుండి ఉచితంగా 24 గంటలు వైరా వరకు ఆటో సర్వీస్ చేస్తూ, పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సమయంలో ఉచితంగా పరీక్ష సెంటర్లకు చేరవేస్తూ పలువురు మనల్ని పొందుతున్నాడు.









