రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 17:- మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవటమే మొహరం పండుగ.మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత.మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మొహరం పండగను పురస్కరించుకొని బుధవారం రోజు రామాయంపేట మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ప్రజలకు షర్బతును పంపిణీ చేశారు.అనంతరం గోల్పర్తి, దామరచెరువు,అక్కన్నపేట,కాట్రియాల కోనాపూర్,రాయిలాపూర్,ధర్మారం తదితర గ్రామాలలో పీర్ల పండగను ప్రజలు పెద్ద ఎత్తున గ్రామ చావిడిల వద్ద పీర్లను ఎత్తుకొని ఆట పాటలతో హోసయ్ దూల ఆడుతూ మరోపక్క మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతూ జానపద గేయాలు పాడుతూ నృత్యాలు చేస్తూ మతసామరసానికి ప్రతీకగా ప్రజలు ఈ మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు.









