◆ఉదయం 11:00 రుణమాఫీ లబ్దిదారుల తో ర్యాలీ
★ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి
★ఛారకొండ మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు బలరామ్ గౌడ్
నేటి గదర్ న్యూస్,ఛారకొండ:డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం పర్యటన విజయవంతం చేయాలని ఛారకొండ మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు బలరామ్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే పర్యటనకు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు.ఈ నెల 18 గురువారం ఉదయం09 గంటలకు తిమ్మాయిపల్లీ గ్రామంలో,10:00 గంటలకు మరిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చే
నూతన గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,
రుణ మాఫీ సంబరాలు11:00 రుణమాఫీ లబ్దిదారుల తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .ఈ ర్యాలీలో డీసీసీ అధ్యక్షులు& అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొంటారని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.









