+91 95819 05907

అర్ధరాత్రి వేళ అమ్మో త్రాచు పాము…సకాలంలో స్పందించిన SI కి హ్యాట్సాఫ్

★అర్ధరాత్రి తక్షణమే స్పందించిన ఎస్సై మేడ ప్రసాద్

★ స్నేక్ క్యాచర్ ని పిలిచి త్రాచు పామును బంధించారు

★ అర్ధరాత్రి స్పందించిన పోలీసులకి హాట్సాఫ్ చెబుతున్న మణుగూరు పట్టణ ప్రజలు

నేటి గదర్ న్యూస్,మణుగూరు : పోలీసులు అంటేనే రక్షకభటులు. ప్రజలు కష్టాలలో ఉంటే కర్తవ్యం విధి నిర్వహణలో భాగంగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఒంటిపై వేసుకున్న కాకి చొక్కా ఎలా స్పందిస్తుందో నిరూపించాడు ఆ ఎస్ఐ. మణుగూరు పట్టణంలో ఓ ఇంట్లో కి పెద్ద త్రాచు పాము చేరి బుసలు కొడుతుంటే ఆ కుటుంబం మొత్తం గజగజ వణికి పొయ్యారు. వారికి ఏమి పాలు పోక మణుగూరు పోలీసులకు సమాచారం అందించారు .మేము ఉన్నాం అంటూ మణుగూరు పోలీసులు అర్ధరాత్రి వేళ స్పందించారు.సకాలంలో స్పందించిన పోలీసులకు మణుగూరు పట్టణ ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.
మణుగూరు లో బుధవారం అర్ధరాత్రి(తెల్లరితే గురువారం) వేళ అశోక్ నగర్ లో ఒక ఇంట్లో గోధుమ త్రాచు పాము దూరి బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది.ఈ క్రమంలో వారు ఆ అర్థరాత్రి మణుగూరు పోలీస్ కి సమాచారం అందించారు.తక్షణమే స్పందించిన ఎస్సై మేడ ప్రసాద్ స్నేక్ క్యాచర్ ని పిలిపించి ఆ త్రాచు పామును పట్టించారు. అప్పటివరకు భయంతో వణికి పోయిన ఆ ఇంటిగల వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత అర్ధరాత్రి వేళ స్పందించి తమ ఇంటికి వచ్చి సహాయం చేసిన ఎస్సై మేడ ప్రసాద కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని… పోలీసులకు సకాలంలో సమాచారం చేరవేస్తే స్పందిస్తామని తెలిపారు. హాట్సాఫ్ మణుగూరు పోలీస్.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !