నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి తోమాల సేవలో పాల్గన్నారు. ముందుగా ఆలయం వద్ద చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ప్రజలంతా సుఖసంపదలతో వర్థిల్లాలని కోరుకున్నట్టు మంత్రి వెల్లడించారు.
Post Views: 75









