రామాయంపేట ( నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీ ఒకటవ వార్డులో యెనిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో డాక్టర్ సింధు పేరుపైన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు ఆయన గురువారం ఉచితంగా నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరం అవుతున్న నిరుపేద విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేసినట్లు ఆయన తెలిపారు.భగవంతుడి దీవెనలు ఆశీస్సులు ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు ఇంకా ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ తాము చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐరేని రవీందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు డాకిస్వామి.జై భీమ్ జిల్లా అధ్యక్షుడు పాతూరి రాజు,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బైరంకుమార్. నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు జహీరోద్దీన్ సుంకోజు దామోదర్, బంజరా ఐక్యవేదిక నాయకులు సురేష్ నాయక్ పార్టీ కార్యకర్తలు గణేష్ .శంకర్ . సాకేత్ తదితరులు పాల్గొన్నారు.









