రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేసే విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామాయంపేట సిఐ.వెంకట రాజా గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు మత్తు మందులపై జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారకద్రవ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి మారకద్రవ్యాల వాడకంపై కార్యక్రమాలు చేపట్టిందన్నారు.విద్యార్థులకు ముఖ్యంగా మత్తు పదార్థాలు తీసుకోకుండా తగు జాగ్రత్తలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు కూడా చేసిందన్నారు. మన మనస్సును కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి మత్తు మందులో మన చెంతకు రావని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 99









