నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి,✍️ సతీష్ కుమార్ జినుగు,
*ఖమ్మం సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ సీనియర్ నేత రాయల చంద్రశేఖర్ అకాల మరణం పట్ల తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం పోరాటం చేసిన కమ్యూనిస్ట్ గా రాయల చంద్రశేఖర్ తనదైన ముద్ర వేశారన్నారు. చంద్రశేఖర్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు.
Post Views: 71









